- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దిశ, ఇటిక్యాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎర్రవల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. విజయ్ ఆయిల్ మిల్ దగ్గర 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన

X
దిశ, ఇటిక్యాల : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇటిక్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది. విజయ్ ఆయిల్ మిల్ దగ్గర 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవి కథనం మేరకు ఇటిక్యాల మండలం ఉదండాపురం గ్రామానికి చెందిన నబీసాబ్ 43 సంవత్సరాలు తన మోటార్ సైకిల్ పై కొండ పేట వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో మరో మోటర్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి అజ్జాగ్రత్తగా, అతివేగంగా నబిసాబ్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టడంతో నబీసాబ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య పింజరి పీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవి తెలిపారు.
Next Story






