- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి వ్యక్తి మృతి
దిశ, నవాబుపేట : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విక్రమ్

X
దిశ, నవాబుపేట : చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన నవాబుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్ పేట గ్రామానికి చెందిన రావుల చంద్రయ్య ( 48) మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. వీలు చిక్కినప్పుడు తమ కులవృత్తిలో భాగంగా చేపలు పట్టడానికి వెళ్లేవాడు. అదేవిధంగా ఈ నెల రెండవ తేదీన గ్రామ సమీపంలోని పోచమ్మ కుంటలోకి చేపలు పట్టడానికి వెళ్లిన చంద్రయ్య ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి రెండు రోజుల వరకు కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం నీటిపై తేలియాడింది. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు
Next Story






