- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
by Ratna Kumari |
అన్నం గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం దామరవంచ గ్రామ శివారు పిల్లగుండ్ల తండాలో చోటు చేసుకుంది.

X
దిశ, గూడూరు : అన్నం గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం దామరవంచ గ్రామ శివారు పిల్లగుండ్ల తండాలో చోటు చేసుకుంది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లి గుండ్ల తండా గ్రామానికి చెందిన బానోత్ బిచ్చ (54) తండాలో కుటుంబ సభ్యులతో కలసి దుర్గమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ అనంతరం మంగళవారం రాత్రి భోజనం చేస్తున్న క్రమంలో గొంతులో ఆహారం ఇరుక్కుపోయి ఊపిరాడక పోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బిచ్చ మృతిపై మృతుని కుమారుడు బానోత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






