గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

గుర్తు తెలియని వాహనం ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.

గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొని వ్య‌క్తి మృతి
X

దిశ‌, తిరుమ‌లాయ‌పాలెం : గుర్తు తెలియని వాహనం ఢీకొని తాపీ మేస్త్రి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని జల్లేపల్లి గ్రామానికి చెందిన అనపర్తి ఎల్లయ్య (40) తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి తన బైక్ పై మరిపేడ బంగ్లా వైపు వెళ్తుండగా మార్గం మధ్య పాతర్లపాడు శివారు జిన్నింగ్ మిల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, మూడేండ్ల బాబు ఉన్నారు.

Next Story