- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి జారిపడి వ్యక్తి మృతి..
మండలంలో ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది.

X
దిశ, చిలుకూరు : మండలంలో ప్రమాదవశాత్తు ఇంటి పై నుంచి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సీత్లా తండాకు చెందిన బాదావత్ బాలాజీ నాయక్ (45) బుధవారం తన ఇంటిపైన సామాను సర్దుతున్నాడు. ఈ సమయంలో అతని కాలుకు ఇనుప తీగ తట్టడంతో డాబా అంచున ఉన్న ఆయన బ్యాలెన్స్ తప్పి పై నుంచి కిందపడిపోయాడు.
తలకు బలమైన గాయాలైన అతనిని వెంటనే కోదాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడని అక్కడి వైద్యులు ధృవీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
Next Story






