ఆడుకుంటూ వెళ్లి ఆటో కింద పడ్డ ఏడాదిన్నర చిన్నారి

by Muthe.Rajitha |

ఆడుకుంటూ వెళ్ళి ఆటో కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.

ఆడుకుంటూ వెళ్లి ఆటో కింద పడ్డ ఏడాదిన్నర చిన్నారి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆడుకుంటూ వెళ్ళి ఆటో కింద పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. జిల్లాలోని సాలూర మండలం సాలంపాడ్ గ్రామానికి చెందిన అయేషా బేగం ఇంటి ముందుకు వచ్చిన ఉల్లిగడ్డల ఆటో వద్దకు వెళ్ళింది. తల్లి వెళ్లగానే ఆమెతోపాటు పాకుతూ ఆమె 18 నెలల చిన్నారి కూడా ఆటో వద్దకు వచ్చింది. అయితే బేరం కుదరకపోవడంతో అయేషా వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లగా.. ఆ పాప ఆటో ముందే ఉన్న విషయం గమనించక, ఆటోడ్రైవర్ ఆటోను ముందుకు పోనిచ్చాడు.

దీంతో ఆటో పాప తలపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్ళముందే బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story