- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో దారుణ ఘటన.. 30 రోజులుగా మైనర్‌పై అత్యాచారం.. భోజనం పెడుతామని.. పూట పూటకు దారుణంగా..
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పక్కింటి మైనర్ బాలికను తన పుట్టింటికి తీసుకెళ్లింది. అక్కడ పాపను బంధించి.. పూట పూటకు అత్యాచారం చేయించింది. దాదాపు ముప్పై రోజులు బాలిక ఓ రూమ్‌లో బంధించబడగా..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ పక్కింటి మైనర్ బాలికను తన పుట్టింటికి తీసుకెళ్లింది. అక్కడ పాపను బంధించి.. పూట పూటకు అత్యాచారం చేయించింది. దాదాపు ముప్పై రోజులు బాలిక ఓ రూమ్‌లో బంధించబడగా.. కేవలం ఫుడ్ పెట్టేందుకు మాత్రమే గది తలుపు తెరవబడేది. ఆ భోజనం పెట్టేందుకు వచ్చిన వ్యక్తి ఆమెను రేప్ చేసేవాడు. రోజులో పూటపూటకు ఇలాగే జరిగేది. అయితే అనుమానం వచ్చిన పాప బంధువు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటపడింది. తనపై రేప్ జరిగిందని బంధువుకు చెప్పుకుని ఏడ్చింది బాధిత బాలిక.
దీంతో సదరు మహిళ, తన సోదరులు సందీప్, మన్మోహన్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మరింత మంది కూడా చిన్నారిపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉండగా.. దీనిపై విచారిస్తున్నారు పోలీసులు. బాలికను ఆగస్టులో బంధించిన మహిళ.. సెప్టెంబర్ మొదటి వారం వరకు నరకం చూపించింది. వైద్య పరీక్షలో పాపపై దీర్ఘకాలికంగా రేప్ జరిగినట్లు నిర్ధారించబడింది. అత్యాచారం, గ్యాంగ్ రేప్, పోక్సో కేసు, అక్రమంగా బంధించడం, బెదిరింపు ఆరోపణల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సందీప్, మన్మోహన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మహిళ కోసం వెతుకుతున్నారు.






