- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లల కళ్ల ముందే.. భార్యపై పెట్రోల్ పోసి సజీవ దహనం.. (వీడియో)
గ్రేటర్ నోయిడాలోని దాద్రీ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వరకట్నం డిమాండ్ చేస్తూ భార్యను సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2016లో నిక్కీ పాయలా, విపిన్ భాటికి వివాహం జరిగింది. అదే టైంలో నిక్కీ సోదరిని,

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ నోయిడాలోని దాద్రీ ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. వరకట్నం డిమాండ్ చేస్తూ భార్యను సజీవ దహనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2016లో నిక్కీ పాయలా, విపిన్ భాటికి వివాహం జరిగింది. అదే టైంలో నిక్కీ సోదరిని, విపిన్ సోదరుడికి వచ్చి వివాహం జరిపారు. అయితే వీరిద్దరు బాగానే ఉన్నా.. నిక్కీ భర్త విపిన్ మాత్రం తాగుడుకు బానిసై టార్చర్ పెట్టేవాడు. రూ. 35 లక్షల అదనపు వరకట్నం గురించి తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు గురిచేసేవాడు. ఆగస్టు 21న కూడా ఈ విషయంలోనే భార్యను దారుణంగా హింసించిన విపిన్.. పిల్లల కళ్ల ముందే.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నిక్కీ చెల్లి రికార్డ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మరో వీడియోలో తండ్రి ఘాతుకాల గురించి చిన్న పిల్లాడు చెప్పడంతో.. విపిన్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక విపిన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న విపిన్ గురించి గాలిస్తున్నారు.






