- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాకింగ్ కి వెళ్లిన వ్యక్తి మృతి
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : వాకింగ్ కి వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండల పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, ఆసిఫాబాద్ : వాకింగ్ కి వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండల పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండల పరిధిలోని మంగి విద్యుత్ శాఖ ఫీడర్ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న పర్చాకి మారుతి(38) ఉదయం వాకింగ్ కి వెళ్లాడు. అంతలోనే కుప్పకూలిపోయాడు. అతను గుండె పోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఉదయం మారుతి మార్నింగ్ వాకింగ్ వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య విజయలక్ష్మి వెళ్లి చూడగా మార్గమధ్యంలో పడిపోయి ఉన్నాడు. వేంటనే అతని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిరక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Next Story






