- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. రోడ్డు పై వెళ్తున్న మహిళ ప్రైవేట్ పార్ట్‌ను తాకిన వ్యక్తి.. చివరికి?(వీడియో)
రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న మహిళను ఓ వ్యక్తి అసభ్యంగా తాకిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో బురఖా ధరించిన ఓ మహిళను అసభ్యంగా తాకిన ఆదిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న మహిళను ఆదిల్ వెనుక నుంచి గట్టిగా పట్టుకొని ప్రైవేట్ పార్ట్‌లను తాకి పారిపోవడానికి ప్రయత్నించాడు. చూట్టు ఎవరు లేకపోవడాన్ని గమనించిన అతడు ఆమెను లైంగిక వేధించాడు. వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అదే రోజు అతడిని గుర్తించారు. ఈ క్రమంలో అతడు పోలీసులను చూసి ఇల్లీగల్ వెపన్‌తో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. కాల్చి పట్టుకున్నారు. అనంతరం అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించి ఆమెకు క్షమాపణలు చెప్పించారు.






