ఎలుకను చంపిన కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష?

by Dishafeatures2 |
ఎలుకను చంపిన కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష?
X

దిశ, వెబ్ డెస్క్: ఎలుకను చంపిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఆ వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు చిన్న ఇటుక కట్టి డ్రైనేజీలో పడేశాడు. దీంతో ఇటుక బరువు వల్ల ఆ ఎలుక నీటిలో మునిగిపోయింది. నీటిలో నుంచి పైకి రావడానికి ఆ ఎలుక ఎంతో ప్రయత్నించింది. కానీ దానివల్ల కాలేదు. అయితే యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్త వికేంద్ర శర్మ అనే వ్యక్తి ఈ దృశ్యాన్ని దూరం నుంచి తన సెల్ ఫోన్ లో బంధించారు. వెంటనే అక్కడికి వచ్చి ఎలుకను నీటిలోపల నుంచి బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ నీళ్లు బాగా మింగడంతో ఊపిరాడక ఎలుక చనిపోయింది.

దీంతో వికేంద్ర శర్మ సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి 30 పేజీల ఛార్జీషీట్ ఫైల్ చేశారు. అందులో ఎలుక పోస్టుమార్టం రిపోర్టును కూడా జత చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి నిందితుడు మనోజ్ కుమార్ పై ప్రివెన్షన్ ఆఫ్ క్రూఎల్టీ టూ యానిమల్ యాక్ట్ సెక్షన్ 11 (1) కింద, అలాగే కిల్లింగ్ ఆర్ మెయిమింగ్ యానిమల్స్ యాక్ట్ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 429 ప్రకారం నిందితుడికి 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. కాగా నిందితుడు ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ యాక్ట్ ప్రకారం ఎలుకను చంపడం పెద్ద నేరం కాదని బదౌన్ డీఎఫ్ఓ అశోక్ కుమార్ సింగ్ తెలిపాడు.

Read more:

ఆమె తండ్రి, కొడుకుతో పడుకుందన్న ఉమైర్.. మగతనమే లేదన్న హీరోయిన్

Next Story

Most Viewed