- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల జిల్లాలో అన్నను చంపిన తమ్ముడు
by Malleboina Mahesh |
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి (45) ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ హతమార్చాడు.

X
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి (45) ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ హతమార్చాడు. ఆదివారం అర్ధరాత్రి నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండతో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఘటనపై బుగ్గారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
Next Story






