- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూపీలో దారుణం.. వ్యక్తిని లాక్కెళ్లి చంపేసిన మొసలి
యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మొసలి నదిలోకి లాక్కెళ్లి దాడి చేయగా 22 గంటల తరవాత అతడి మృతదేహం లభ్యమైంది.

దిశ, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని మొసలి నదిలోకి లాక్కెళ్లి దాడి చేయగా 22 గంటల తరవాత అతడి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బహేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ వీర్ నిషద్ అనే వ్యక్తి చంబల్ నది వద్దకు పశువులకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో మొసలి అకస్మాత్తుగా దాడి చేసింది. రామ్ వీర్ ప్రతిఘటించినా మొసలి పట్టు వదలకుండా అతడిని నదిలోకి లాక్కెల్లింది. అక్కడే ఉన్న కొంతమంది వెంటనే వచ్చి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక బృంధాన్ని రంగంలోకి దింపారు. 22 గంటల పాటూ శ్రమించిన ఆ బృంధం డెడ్ బాడీని కనుగొని ఒడ్డుకు తీసుకువచ్చింది. బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. మొసళ్లు దాడి చేస్తాయి కానీ ఈ స్థాయిలో మనిషిని నదిలోకి లాక్కెళ్లడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.






