- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సార్.. నాకు న్యాయం చేయండి.. సంచిలో చనిపోయిన బిడ్డతో కలెక్టర్ కార్యాలయానికి తండ్రి
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మరణించింది. దీంతో న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు తండ్రి. పాప మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ అధికారులను

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మరణించింది. దీంతో న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు తండ్రి. పాప మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. మహేవాగంజ్ ఏరియాలోని గోల్డర్ హాస్పిటల్‌కు భార్య రూబీని డెలివరీ కోసం తీసుకెళ్లాడు భర్త విపిన్ గుప్తా. కానీ డాక్టర్లు ట్రీట్మెంట్ అందించడంలో లేట్ చేయడం, తప్పుడు మందులు ఇవ్వడంతో భార్య ఆరోగ్య పరిస్థితి దిగజారింది. పుట్టిన శిశువు మరణించింది. కావాలనే ఫీజు విషయంలో గొడవ తలెత్తేలా చేశారని, మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని.. కానీ రాంగ్ మెడిసిన్‌తో అప్పటికే బిడ్డ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారని చెప్పాడు. సదరు ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అధికారులు గోల్డర్ హాస్పిటల్‌ను సీల్ చేశారు.






