- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్‌లో ఘరానా చోరీ.. మత్తు మందు ఇచ్చి రూ.20 లక్షలతో జంప్
నగరంలోనే సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఘరానా చోరీ కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోనే సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో ఘరానా చోరీ కలకలం రేపింది. నమ్మకంగా పనిలో చేరిన ఓ వంట మనిషి, తోటి పని మనుషులకు మత్తు మందు ఇచ్చి సుమారు రూ.20 లక్షల విలువైన నగదు, నగలతో పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో భువన్ అనే నేపాలీ యువకుడు 15 రోజుల క్రితమే వంట మనిషిగా పనిలో చేరాడు. అయితే, బుధవారం తన పుట్టినరోజు అంటూ తోటి పని మనుషులను, వాచ్‌మెన్‌ను నమ్మించాడు. బర్త్‌డే వేడుకల పేరుతో అందరికీ కూల్ డ్రింక్స్ పంపిణీ చేశాడు.
కానీ, ఆ కూల్ డ్రింక్స్‌లో ముందే మత్తు మందు కలిపిన భువన్, అందరూ స్పృహ కోల్పోగానే అసలు పని మొదలుపెట్టాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ.20 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. గురువారం ఉదయం ఎంతసేపటికీ పని మనుషులు నిద్ర లేవకపోవడం, వాచ్‌మెన్ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో అనుమానం వచ్చిన ఇంటి యజమానులు లోపలికి వెళ్లి చూడగా చోరీ జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అపార్ట్‌మెంట్‌లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిందితుడు నేపాల్‌కు పారిపోయే అవకాశం ఉన్నందున రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.






