- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో దారుణం.. వివాహితపై 8 మంది లైంగిక దాడి..గుట్టల్లోకి లాక్కెళ్ళి!
తెలంగాణ రాష్ట్రంలో ( Telangana ) మరో దారుణం జరిగింది. దైవదర్శనానికి వచ్చిన యువతిపై ( Lady ) సామూహిక అత్యా***చారం

దిశ, వెబ్‌డెస్క్/ నాగర్ కర్నూల్/ఊరుకొండపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లిన ఓ వివాహితపై యువకులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకోగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి పాలమూరు జిల్లా భూత్పూర్ మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (30) మహిళ శనివారం రాత్రి అంజన్న దర్శనం కోసం ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. దర్శనం అనంతరం అందరూ నిద్రకు ఉపక్రమించారు.
ఈ క్రమంలోనే బహిర్భూమికి వెళ్లినట్లుగా వచ్చి అక్కడే మాటువేసిన యువకులు పక్కనే ఉన్న గుట్టపైకి ఈడ్చుకెళ్లి గ్యాంగ్‌రేప్‌నుకు పాల్పడ్డారు. అయితే, సదరు మహిళ గుడి వద్దకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యుకు అనుమానం వచ్చి వెతికారు. దీంతో సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకులు ఆమె కాళ్లను తాళ్లతో కట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఆలయ ఉద్యోగితో పాటు బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల అరిష్, మహేష్, వాగుల్దార్ మణికంఠ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు సమాచారం.






