- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున ఓంకార్ (25) అనే ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారు జామున ఓంకార్ (25) అనే ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని హాస్పిటల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్పత్రిలోని బాత్రూమ్ లో ఓంకార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓంకార్ కొంత కాలం క్రితం ఉద్యోగ నిమిత్తం నిజామాబాద్ నగరానికి వచ్చి తను పనిచేస్తున్న ఆస్పత్రి సమీపంలోని కాలానీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఇదే ఆస్పత్రిలో కంటిన్యూగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ ఆస్పత్రిలోనే సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలను తావిస్తోంది. ప్రతిరోజు డ్యూటీకి వచ్చినట్లే ఆస్పత్రికి వచ్చిన ఓంకార్ శుక్రవారం తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా, ఆసుపత్రి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.






