Kidney Racket Case: బెంగళూరు వైద్యుడిపై పోలీసుల అనుమానం?

by Gantepaka Srikanth |

కిడ్నీ రాకెట్ వ్యవహారం(Kidney Racket Case)లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎనిమిది మంది దళారుల పాత్రను పోలీసులు గుర్తించారు.

Kidney Racket Case: బెంగళూరు వైద్యుడిపై పోలీసుల అనుమానం?
X

దిశ, వెబ్‌డెస్క్: కిడ్నీ రాకెట్ వ్యవహారం(Kidney Racket Case)లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎనిమిది మంది దళారుల పాత్రను పోలీసులు గుర్తించారు. ఆరు నెలలుగా ఎల్బీనగర్ సమీపంలోని సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital)లో కిడ్నీ మార్పిడి దందా కొనసాగుతున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన వైద్యుడు(Bangalore Doctor) కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే అలకనంద ఆసుపత్రి నిర్వహకుడు సుమంత్‌(Sumanth)ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్ధిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు బరిగితెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగుచూసింది.

దాదాపు 5 గంటలకు పైగా బాధితులతో మాట్లాడిన అనంతరం డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బాధితులను ఆసరాగా చేసుకొని ఈ దందాకు తెరలేపారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు సైతం సీరియస్ అవుతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇంత పెద్ద శస్త్రచికిత్సలు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే విలువ లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story