హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మరో భారీ షాక్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మరో భారీ షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. స్టాఫ్ జీతాలు మినహా ఎలాంటి ఆర్థికపరమైన చర్యలు తీసుకోరాదు అంటూ హెచ్‌సీఏను హెచ్చరించింది. ఐపీఎల్ వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

Next Story