- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని పాళికబజార్ లో ఉన్న ధమాకా సేల్స్ బట్టల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని పాళికబజార్ లో ఉన్న ధమాకా సేల్స్ బట్టల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పక్క షాపులకు కూడా వ్యాపించాయి. అగ్ని ప్రమాదం వల్ల అక్కడంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం, దట్టంగా పొగ అలుముకోవడంతో ఫైర్ సిబ్బందికి మంటలు ఆర్పేందుకు ఇబ్బందిగా మారింది. కాగా ఈ బజార్ లో దాదాపు 400కు పైగా షాపులున్నట్లు తెలుస్తోంది. మంటలను గనుక ఆర్పకపోతే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఫైర్ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






