- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వైద్య దంపతులతో పాటు ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ధన్ బాద్‌లోని ఓ ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ధన్ బాద్‌లోని ఓ ఆసుపత్రిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని వైద్య దంపతులతో పాటు ఐదుగురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే.. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇక్కడే ప్రాణాలు కోల్పోయారని మృతులు బంధువులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






