హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్(Hyderabad) శివారులోని చర్లపల్లి పారశ్రామికవాడ(Cherlapally industrial town)లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది.

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) శివారులోని చర్లపల్లి పారశ్రామికవాడ(Cherlapally industrial town)లో భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. మంగళవారం సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఫ్యాక్టరీలో ఉన్న రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. అగ్నిప్రమాద ప్రాంతం మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరై పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఫైరింజన్ల సాయంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని.. అగ్నిప్రమాదం సంబవించడానికి గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story