వృద్ధురాలిపై దారుణం.. కనికరం లేకుండా కళ్లలో కారం చల్లి మరీ!

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-29 07:45:32  IST  )

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.

వృద్ధురాలిపై దారుణం.. కనికరం లేకుండా కళ్లలో కారం చల్లి మరీ!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ వృద్ధురాలు పొలం పనులకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)లోని పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం పాలమెట్ట గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం పొలం పనులకు వెళ్లి పగలు ఇంటికెళ్దామని బయలుదేరిన వృద్ధురాలు రాగోలు అన్నపూర్ణ. పొలం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా వృద్ధురాలు మెడలో 2 తులాల బంగారు పుస్తెలతాడును ఓ గుర్తు తెలియని దుండగుడు ఎత్తుకెళ్లాడు.

అంతేకాదు వృద్ధురాలు అనే కనికరం లేకుండా ఆమెను కింద పడేసి కళ్లలో కారం జల్లి బంగారు గొలుసు లాక్కున్నాడు. వృద్ధురాలు అరుస్తూ ప్రతిఘటించే ప్రయత్నం చేయగా ఆమెను రోడ్డుపై చుట్టూ తిప్పి కింద పడవేసి అక్కడ నుంచి పరారయ్యాడు. కంట్లో కారం మంటతో తల్లడిల్లిన ఆ వృద్ధురాలు రోడ్డు పై బోరున విలపించింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆమెను గమనించి విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story