మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డ్ సస్పెండ్

by Javid Pasha |

కంబదూరు పోలీస్ స్టేషన్ లో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డ్ ను సస్పెండ్ చేశారు.

మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన హోంగార్డ్ సస్పెండ్
X

దిశ, కళ్యాణదుర్గం : కంబదూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శివానంద అనే హోంగార్డ్ సమస్యపై స్టేషన్ కు వచ్చిన వివాహిత మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ మహిళ హోంగార్డుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పలు వార్తా పత్రికల్లో, సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు.

ఈ సందర్భంగా కళ్యాణ దుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించి కంబదూరు పోలీస్ స్టేషన్ ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హోంగార్డు శివానందను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ లో ఎవరైనా మహిళల పట్ల అసభ్యకరంగా గాని దురుసుగా గాని ప్రవర్తించినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని డీఎస్పీ హెచ్చరించారు.

Next Story