- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు దుర్మరణం, ఒకరు గల్లంతు
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గల్లంతైన ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District)లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రాజంపేట మండల పరిధిలోని బాలరాజుపల్లి (Balarajupally)లోని చెయ్యేరు (Cheyyeru)లో నలుగురు యువకులు కలిసి ఈతకు వెళ్లారు. అందులో ముగ్గురు శ్వాస ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం గల్లంతైన యువకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతి చెందిన వారిని దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. వారంతా అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని నిర్ధారించారు.
Next Story






