రాష్ట్రంలో తీవ్ర విషాదం.. నిప్పంటించుకుని వృద్ధ దంపతులు మృతి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. నిప్పంటించుకుని వృద్ధ దంపతులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని బోట్యా‌తండా (Botya Thanda)కు చెందిన భూక్య లచ్చు, వీరమ్మ దంపతులు కొన్నాళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన వారు ఆదివారం రాత్రి ఇద్దరూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్ర కాలిన గాయాలతో భార్య వీరమ్మ స్పాట్‌లోనే మృతిచెందగా.. సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త భూక్య ఇవాళ సాయంత్రం కన్నుమూశాడు. ఈ మేరకు మృతుల కుమారులు తమ తల్లిదండ్రులు అనారోగ్య సమస్యల వల్లే ఆత్యహత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story