- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో తీవ్ర విషాదం.. ఉరేసుకుని హోంగార్డు బలవన్మరణం
by Kema Shiva Kumar |
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్-రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న గోవర్ధన్ కొన్నాళ్ల నుంచి ఆర్థిక ఇబ్బందుతో సతమతమవుతున్నాడు. అయితే, అతని కూతురు కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతుండటంతో ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నాడు. ఓ వైపు సమయానికి నెల జీతం రాక.. కన్న కూతురుకి వైద్యం చేయించలేక గోవర్ధన్ పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోవర్ధన్ బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






