- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ ఓ నాలుగేళ్ల చిన్నారిని మింగేసింది.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ ఓ నాలుగేళ్ల చిన్నారిని మింగేసింది. ఈ విషాదం సికింద్రాబాద్ కళాసిగూడలో శనివారం ఉదయం జరిగింది. శనివారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. కళాసిగూడ వీధుల్లో కూడా ఇదే విధంగా నీళ్లు నిలిచిపోగా గుర్తు తెలియని వ్యక్తులు మ్యాన్ హోల్ మూత తెరిచి పెట్టారు. కాగా, కళాసిగూడ ప్రాంత నివాసి, 4వ తరగతి విద్యార్థిని మౌనిక పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చి మ్యాన్ హోల్‌లో పడిపోయింది. నీళ్లల్లో కొట్టుకుపోయిన మౌనిక మృతదేహం పార్క్ లేన్ వద్ద బయట పడింది. ఈ సంఘటనతో కళాసిగూడలో విషాదం నెలకొంది.
Next Story






