- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలార్ దేవుపల్లిలో రెచ్చిపోయిన పోకిరి గ్యాంగ్.. నలుగురికి తీవ్ర గాయాలు
by Malleboina Mahesh |
పోకిరిల గొడవ కాస్త తీవ్ర ఉధృతికి దారితీసి నలుగురు పై దాడికి పాల్పడిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, శంషాబాద్ : పోకిరిల గొడవ కాస్త తీవ్ర ఉధృతికి దారితీసి నలుగురు పై దాడికి పాల్పడిన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మహిళాదేవపల్లి డివిజన్లోని బాబుల్ రెడ్డి నగర్‌లో ఇద్దరు మైనర్ యువకుల మధ్య గొడవ జరుగుతుంది. ఆ సమయంలో కాలనీకి చెందిన భాస్కర్, విశాల్, రాజు, విక్రాంత్ ఆపడానికి వెళితే వీరిపై అ పోకిరిలకు సంబంధించిన గ్యాంగ్ రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో రావుల భాస్కర్, విక్రాంత్‌లకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






