మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని.. నగ్నంగా చితకబాదారు

by velandi.Saikiran |

స్నేహితురాలి సోదరి విడాకుల విషయంలో మాట్లాడటానికి మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని బట్టలూడదీసి తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్య

మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని.. నగ్నంగా చితకబాదారు
X


స్నేహితురాలి విడాకుల విషయంలో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి

బట్టలూడదీసి నగ్నంగా చితకబాదిన స్నేహితురాలీ భర్త.. స్నేహితులు

తీవ్రంగా గాయపడిన బాధితుడు

మార్చి నెల 26న గుండ్ల పోచంపల్లిలో ఘటన

ఏప్రిల్ 13న పెట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దాడి వీడియోలు.. ఘటన దృశ్యాలు

దిశ, పేట్ బషీరాబాద్: స్నేహితురాలి సోదరి విడాకుల విషయంలో మాట్లాడటానికి మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని బట్టలూడదీసి తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా విలువలోకి వచ్చాయి. బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న వివరాలను అనుసరించి.. అఫ్జల్గంజ్ ఉస్మాన్ షాహి ప్రాంతానికి చెందిన బాధితుడు (26) బోయినపల్లి లో ఉండే తన స్నేహితురాలి సోదరి ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో బాధితుడి స్నేహితురాలి సోదరి తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, సంబంధిత పత్రాలపై సంతకాలు చేయకుండా గుండ్ల పోచంపల్లి అపర్ణ తులిప్ లో ఉండే తన భర్త అయిన కిరణ్ యాదవ్ తో మాట్లాడాల్సిందిగా బాధితుడునీ కోరింది.

ఆమె విన్నపం మేరకు మార్చి 26 న బాధితుడు గుడ్ల పోచంపల్లికి వెళ్లగా అక్కడ కిరణ్ యాదవ్ , అతని స్నేహితులు బోయిన్పల్లి కి చెందిన పవన్, లడ్డు, సుచిత్రా కి చెందిన జయంత్ యాదవ్, కెపిహెచ్బి కి చెందిన సోహెల్, అంగం పేటకు చెందిన తరుణ్ గౌడ్ లు అతనిపై రాడ్లు, పైపులతో దాడి చేశారు. అంతేకాకుండా అతనిని పూర్తిగా నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టి వీడియోలు తీశారు. ఫిర్యాదు చేస్తే నగ్న వీడియోలను వైరల్ చేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు కాచిగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు రోజులు అడ్మిట్ అయి చికిత్స పొందాడు.

నిందితుల నుంచి వేధింపులు ఎక్కువవడంతో బాధితుడు ఏప్రిల్ 13న పెట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిరణ్ యాదవ్ తో పాటుగా దాడిలో పాల్గొన్న అతని ఐదుగురు స్నేహితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా సదరు దాడి నగ్న వీడియో దృశ్యాలు శుక్రవారం మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. దీంతో ఇన్ని రోజులుగా గోప్యంగా ఉన్న ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లయింది.

Next Story