- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
by Kema Shiva Kumar |
చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలో కోంటూర్ చెరువులో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ, మెదక్ టౌన్ : చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మెదక్ మండల పరిధిలో కోంటూర్ చెరువులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంటూర్ కు చెందిన పున్న నర్సింహులు (45) గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు ఉదయం వెళ్లాడు. చెరువులో చేపలు పడుతుండగా నర్సింహులు వలలో చిక్కుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న అతడిని వెంట ఉన్న వారు కాపాడేందుకు ప్రయత్నించిన సాధ్యం కాలేదు. దీంతో అతను నీటిలో మునిగిపోయాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు.
Next Story






