- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీసీఎంలో చెలరేగిన మంటలు
by Javid Pasha |
ఉప్పల్ రింగ్ రోడ్ లో డీసీఎం వ్యాన్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

X
దిశ, ఉప్పల్: ఉప్పల్ రింగ్ రోడ్ లో డీసీఎం వ్యాన్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారుు. వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం 7 గంటలకు ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద పేపర్ వేస్టేజ్ తో వెళ్తున్న డీసీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా క్యాబిన్ నుండి మంటలు ఎగిసిపడటంతో వ్యాన్ అక్కడే అపి డ్రైవర్ కిందకు దిగాడు. దీంతో మంటలు అంటుకొని డీసీఎం దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. క్యాబిన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Next Story






