- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు క్యూలో నిల్చొని కుప్పకూలిన రైతు
నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకులో క్యూలో నిలుచున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించాడని వైద్యులు ధృవీకరించారు.

దిశ, మక్తల్ : నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకులో క్యూలో నిలుచున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించాడని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది. మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన గిన్నె రాములు(40) మక్తల్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చాడు. పత్తి అమ్మగా ఖాతాలో జమ అయిన నగదు డ్రా చేసుకునేందుకు వచ్చాడు. క్యూ లైన్ లో నిలబడిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మేనేజర్ ఒకేసారి రైతులకు నగదు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తే.. ఈ ప్రమాదం చోటు చేసుకునేది కాదని తోటి రైతులు, కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ప్రాంతానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో ఖాతాదారులున్నారు. పండించిన ధాన్యం అమ్మగా వ్యవసాయ ఆధారిత పంటలకు సంబంధించిన నగదు ఖాతాలో జమ అవుతుంది. వాటిని రైతులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకేసారి డ్రా చేసుకునే అవకాశం లేకుండా లక్ష రూపాయలను నాలుగైదు సార్లు సమయంలో తీసుకోవాలని రూల్స్ పెట్టారు. గిన్నె రాములు లక్ష రూపాయలను ఈ బ్యాంకులో డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకుంటే.. పెద్దపోర్ల గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉన్న బంధువు అకౌంట్ కి కొంత బదిలీ చేసుకొని తీసుకున్నాడు. మిగిలిన కొంత మొత్తాన్ని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో డ్రా చేసుకునేందుకు క్యూలో నిలబడ్డాడు. ఈ మేనేజర్ రైతులు, పేదల పట్ల కాస్త ఆగ్రహంగా ఉంటాడని ఆరోపణలున్నాయి. వ్యాపారస్తులు, కార్పొరేట్ వాళ్లకు అనుకూలంగా.. పేదల పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని పలు రైతు ఖాతాదారులు పేర్కొనడం గమనార్హం.






