- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటు వైద్యం మందు తయారు చేస్తుండగా వైద్యుడి భార్య మృతి.. ఇద్దరికి తీవ్ర అస్వస్థత
నాటు వైద్యం చేసేందుకు వన మూలికల ద్వారా మందును తయారు చేస్తుండగా ఒకరి మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

దిశ, బిజినపల్లి: నాటు వైద్యం చేసేందుకు వన మూలికల ద్వారా మందును తయారు చేస్తుండగా ఒకరి మృతి చెందగా, మరో ఇద్దరు అస్వస్థకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితులు, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ నాటు వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం సాయంత్రం వనమూలికలు తీసుకువచ్చి తన భార్య చాన్బి(65), కూతురు షమీనాతో కలిసి మందు తయారీని చేపట్టారు. రాత్రి అయ్యే సమయంలో ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన మిగతా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందిస్తున్న క్రమంలో చాన్బి మృతిచెందగా, నిరంజన్, ఆయన కుమార్తె షమీనా చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఒకరు మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో విషాద ఛాయలు అములుకున్నాయి. నాటు వైద్యంలో ఎంతో అనుభవం ఉన్న నిరంజన్ కుటుంబంలో ఈ ఈ ఘటన జరగడం గ్రామస్తులను కలవర పెడుతుంది. అసలు ఈ విషాదం ఎలా జరిగింది..? కారణాలు ఏంటో తెలియాలంటే నిరంజన్ కోలుకున్న తర్వాతే వెలుగు చూసే అవకాశం ఉంది.






