బావిలో మృతదేహం లభ్యం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-11 15:33:58  IST  )

దిశ, కేటీ దొడ్డి : బావిలో మృత దేహం లభ్యమైన సంఘటన మండలంలోని నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. ఎసై శ్రీనివాసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నందిన్నె గ్రామానికి చెందిన తోలు పెద్ద నరసప్ప

బావిలో మృతదేహం లభ్యం
X

దిశ, కేటీ దొడ్డి : బావిలో మృత దేహం లభ్యమైన సంఘటన మండలంలోని నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. ఎసై శ్రీనివాసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నందిన్నె గ్రామానికి చెందిన తోలు పెద్ద నరసప్ప అలియాస్ బెల్లమన్నా (50) తాగుడుకు బానిస‌య్యాడు. దీంతో అత‌ను ఇంటికి కూడా సరిగ్గా వెళ్లకుండా ఎక్కడపడితే అక్కడ తిరిగేవాడు. ఇదే క్రమంలో కురువ చిన్నయ్య బావిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడని తమ్ముడు నరసప్ప పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు.

Next Story