విద్యుత్ వైరు త‌గిలి భ‌వ‌న నిర్మాణ కార్మికుడు మృతి

by Ratna Kumari |

దిశ‌, ఆర్మూర్ : విద్యుత్ వైర్ త‌గిలి భ‌వ‌న నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ ఎస్హెచ్ ఓ స‌త్య‌నారాయ‌ణ గౌడ్ తెలిపిన

విద్యుత్ వైరు త‌గిలి భ‌వ‌న నిర్మాణ కార్మికుడు మృతి
X

దిశ‌, ఆర్మూర్ : విద్యుత్ వైర్ త‌గిలి భ‌వ‌న నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘ‌ట‌న ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ ఎస్హెచ్ ఓ స‌త్య‌నారాయ‌ణ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలిత కుమార లహరి (35) అనే వ్య‌క్తి భ‌వ నిర్మాణ కార్మికుడు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇంటి నిర్మాణ కార్మికుడు ఆర్మూర్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంటి నిర్మాణ పనుల్లో ఉండగా తన చేతిలోని అల్యూమినియం పట్టి బిల్డింగ్ పైన ఉన్న వైర్లకు తాకగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. కింద పడిపోయిన ఆ ఇంటి నిర్మాణ కార్మికుడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు దృవీకరించారు. ఇంటి నిర్మాణం కార్మికుడి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Next Story