- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేష్ నిమజ్జనంలో ముగ్గురికి కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం
ణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గేర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య గొడవ

X
దిశ, కోరుట్ల టౌన్: గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గేర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లకు దారి తీసింది. బోజగిరి మహేష్, నలుమాల ప్రశాంత్, బోజగిరి రాజులపై మరో వర్గం కు చెందిన కొందరు పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.
కత్తి పోట్లకు గురైన రాజు, ప్రశాంత్, మహేష్ లను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వర్గానికి చెందిన చంద్రగిరి నరేష్ సైతం కత్తిపోట్లకు గురికాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహేష్‌ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలించారు. సంఘటన స్థలానికి కమలాపూర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : చాక్లెట్ చూపి ఆరేళ్ల బాలికపై అత్యాచారం..
Next Story






