- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారపల్లిలో బైకు ఢీ కొని చిన్నారి మృతి
రోడ్డు దాటుతుండగా బైకు ఢీ కొని ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లిలో చోటు చేసుకుంది.

దిశ, మేడిపల్లి : రోడ్డు దాటుతుండగా బైకు ఢీ కొని ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మహమూద్ ఖాతాన (58), ఆమె మనుమరాలు ఫాతిమా (11), నారపల్లిలోని రోడ్డు అవతలి తన కూతురు ఇంటి వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా నారపల్లి మసీదు సమీపంలో రోడ్డు దాటుతుండగా మేడిపల్లి నుంచి ఘాట్ కేసర్ వైపు వెళుతున్న బుల్లెట్ బైకు వారిని ఢీ కొట్టాడు. మహమూద ఖతున కి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి తాయిబా ఫాతిమాకు తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించగా చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడం తో గాంధీ ఆసుపత్రి కి తరలించారు. చిన్నారి అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. చిన్నారి తండ్రి మహమ్మద్ ఇర్ఫాన్ పిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






