- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి ఆరుగురిని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారక ఘటన కాకినాడ (Kakinada) జిల్లా కిర్లంపూడి (Kirlampudi) మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదారక ఘటన కాకినాడ (Kakinada) జిల్లా కిర్లంపూడి (Kirlampudi) మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవరం (Somavaram) గ్రామంలో జగ్గంపేట జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ముందు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో కారు అతివేగంలో అదుపుతప్పి ఆరుగురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు గ్రామస్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం కిర్లంపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read More..
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది






