తుల్జాభ‌వాని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా ట్రాలీని ఢీ కొట్టిన కారు

by Ratna Kumari |

తుల్జా భ‌వాని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా.. ట్రాలీని ఢీ కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు.

తుల్జాభ‌వాని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా ట్రాలీని ఢీ కొట్టిన కారు
X

దిశ‌, చేవెళ్ల : తుల్జా భ‌వాని ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా.. ట్రాలీని ఢీ కారు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం వార్డుకు చెందిన కాసుల మహేష్‌ గౌడ్‌ (27) తన స్నేహితులు, బంధువులతో కలిసి మహారాష్ట్ర‌లోని తుల్జాపూర్‌ భవానీ మాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జహీరాబాద్ శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న హ్యుందాయ్‌ వెన్యు కారు (టీఎస్ 07 జీవై 4934) రోడ్డుపై నిలిపి ఉంచిన టాటా ట్రాలీ ఆటో (ఎంహెచ్‌ 25 ఏజే 3369)ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీట్లో ఉన్న కాసుల మహేష్‌ గౌడ్‌ (27), వెనుక సీట్లో ఉన్న మైలాపురం రోహిత్‌ కుమార్‌ (17) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న నాంపల్లి కార్తీక్‌ (27), ఆతేంద్ర సాయి (9), నితిన్‌ గౌడ్‌ (6), కె.నర్సింలు (32) తీవ్రంగా గాయప‌డ‌టంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుప‌త్రికి తరలించారు. ట్రాలీ ఆటో డ్రైవర్‌ ఎలాంటి హెచ్చరిక సూచనలు లేకుండా నిర్లక్ష్యంగా వాహనాన్ని రోడ్డుపై నిలిపివేయడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు మహేష్‌ గౌడ్‌ తండ్రి కాసుల సుదర్శన్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు జహీరాబాద్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story