- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
by Batti.Sumithra |
తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగల కొట్టి నగలు, నగదు చోరీకి పాల్పడిన ఘటన మెదక్ పట్టణం నల్ల పోచమ్మ గుడి వెనకాల ఉన్న ఓ వెంచర్ లొ సోమవారం తెల్లవారు జామున జరిగింది.

X
దిశ, మెదక్ ప్రతినిధి : తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగల కొట్టి నగలు, నగదు చోరీకి పాల్పడిన ఘటన మెదక్ పట్టణం నల్ల పోచమ్మ గుడి వెనకాల ఉన్న ఓ వెంచర్ లొ సోమవారం తెల్లవారు జామున జరిగింది. పట్టణంలోని నల్లపోచమ్మ వెనక కొత్తగా ఏర్పడిన వెంచర్ లో ఉపాధ్యాయుడు దేవ్లా నివాసం ఉంటున్నాడు.
వేసవి సెలవులు కావడంతో కుటుంబం సభ్యులతో కలిసి బంధువుల వద్దకు వెళ్ళారు. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలకొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 21 వేల నగదు, తులం బంగారం, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి తాళం పగల కొట్టి ఉండడంతో కాలనీ వారు కుటుంబీకులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ జరుపుతున్నారు.
Next Story






