- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు ఢీకొని ఎద్దు మృతి
by Kema Shiva Kumar |
అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఎద్దును ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

X
దిశ,చిలిపిచెడ్ : అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు ఎద్దును ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిలిపిచెడ్ మండల పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిట్కుల్ గ్రామ శివారులో గంగిరెద్దుల ఎల్లయ్యకు చెందిన ఎద్దు రోడ్డు దాటుతుండగా బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఎల్లయ్య కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమైయ్యారు. ఎద్దు మృతి చెందడంతో తాము జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story






