- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలే మహిళ దారుణ హత్య!
దిశ, గద్వాల క్రైమ్ : పట్టపగలు గద్వాల పట్టణ నడిబొడ్డున జరిగిన మహిళ హత్య కేసులో రోజు రోజుకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ దారుణ హత్యకు బెట్టింగ్‌కు బానిసైన యువకుడి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి.

దిశ, గద్వాల క్రైమ్ : పట్టపగలు గద్వాల పట్టణ నడిబొడ్డున జరిగిన మహిళ హత్య కేసులో రోజు రోజుకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ దారుణ హత్యకు బెట్టింగ్‌కు బానిసైన యువకుడి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. మృతురాలికి పరిచయం ఉన్న గద్వాల పట్టణానికి చెందిన అంతకు ముందు ఆ మహిళతో అప్పు తీసుకుని తిరిగి చెల్లించిన ఆ యువకుడు బెట్టింగ్‌ల కారణంగా భారీగా అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి లోనైన ఆ యువకుడు, మళ్లీ ఆ మహిళ వద్దే అప్పు అడిగాడని తెలుస్తోంది. ఆ మహిళ కొంత సమయం కావాలని చెప్పడంతో, అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఆ యువకుడు క్షణికావేశంలో మహిళపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం. హత్య అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, "మహిళ చనిపోయింది కదా, ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకుంటే దొంగలపైన కేసు మళ్లుతుంది" అనే దురాలోచనతో తిరిగి వచ్చి, మృతురాలి మెడలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు వేగవంతం!
మిస్టరీగా మారిన ఈ మహిళ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 180 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు."బెట్టింగ్ అప్పుల కోసం చేసిన ఈ దారుణ హత్య, ఆపై బంగారాన్ని దోచుకెళ్లడం వెనుక ఉన్న వాస్తవాలను త్వరలోనే వెలికితీస్తాం," అని దర్యాప్తు బృందం తెలిపింది. ఈ కేసును ఛేదించడంలో గద్వాల సీఐ శ్రీనివాస్ బృందం, గద్వాల పట్టణ, రూరల్ ఎస్సైలు కళ్యాణ్ కుమార్, శ్రీకాంత్, మల్దకల్ ఎస్సై నందికర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.






