మహిళ దారుణ హత్య

by Muthe.Rajitha |

ఖమ్మంలో గొంతుకోసి మహిళను హత్య చేసిన దుండగులు

మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కస్బాబజార్‌లోని ఒక మాల్ దగ్గరలో ఓ మహిళ రక్తపు మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మహిళ వయస్సు సుమారు 35 ఏళ్ళు ఉండవచ్చని, గొంతు కోయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వద్ద ఎలాంటి అధరాలు లభించకపోవడంతో ఆమె ఎవరో తెలియలేదు. అయితే తర్వాత ఆమె కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మహిళగా తేల్చారు. ఈ హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు క్లూస్ టీం సంఘటన స్థలంలో పరిశీలన చేపడుతోంది. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Next Story