దారుణం: ఇన్యూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపిన అన్న

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-28 14:05:24  IST  )

ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దారుణం: ఇన్యూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపిన అన్న
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasham Dist) పొదిలి మండలం కాటూరివారిపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్యూరెన్స్ డబ్బుల(Insurance Money) కోసం సొంత చెల్లిని అతికిరాతకంగా అన్న హత్య చేశాడు. రూ.కోటి రూపాయల డబ్బు వస్తుందనే ఆశతో ఈ ఘాతుతానికి పాల్పడ్డాడు. అనంతరం యాక్సిడెంట్‌(Accident)గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు విచారణలో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మనిషిలోని మానవత్వాన్ని కూడా డబ్బు చంపేస్తోంది. డబ్బు కోసం సొంత వ్యక్తులను కడతేర్చుకున్నారు. ఇలాంటి ఘటనపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రావడం లేదు.

గతంలో రైతుబీమా డబ్బు కోసం కన్న తల్లిని కొడుకు కడతేర్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటన మెదక్ జిల్లాలోచోటుచేసుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగించే కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే అప్పులు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో తల్లిని చంపితే అప్పులు తీరడంతో పాటు డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. ఇదే ఆలోచనను భార్యకు చెప్పి.. ఇద్దరూ కలిసి కన్న తల్లిని కడతేర్చారు. ఇలాంటి ఘటనలు రోజూ దేశంలో పదుల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తుండగా.. కొన్ని అవమానంతో బయటకు రానివ్వడం లేదు.

Next Story