ఎంత గొప్ప ప్రేమ జంటో.. ప్రియురాలికి దొంగతనం నేర్పిన ప్రియుడు

by Disha Web Desk 7 |
ఎంత గొప్ప ప్రేమ జంటో.. ప్రియురాలికి దొంగతనం నేర్పిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ ఎంతో మధురం అంటారు. ప్రేమించిన వ్యక్తుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు ప్రేమికులు. వాళ్లు కలిసి బతికేందుకు పెద్దలను సైతం ఎదిరిస్తుంటారు. తన ప్రేమించిన వ్యక్తికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు డబ్బులు లేకపోతే దొంగతనాలు చేసే ప్రేమికులకు చూస్తుంటాము. కానీ, తాము హ్యాపీగా బతకాలని ప్రియుడు దొంగతనాలు చేయడమే కాకుండా తన ప్రియురాలికి కూడా నేర్పించాడు. ఈ విచిత్ర సంఘటన బెంగుళూరులో జరిగింది. మొబైల్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ప్రేమ జంట అసలు గుట్టు తెలుసుకుని కంగు తిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీరాంపూర్‌కు చెందిన మురుగన్ వృత్తి రీత్యా నేరస్థుడు. అతడు రెండేళ్ల క్రితం ద్విచక్రవాహన చోరీ కేసులో మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టై జైలుకు వెళ్లాడు. బెయిల్ రావడంతో బయటకు వచ్చి మళ్లీ చోరీలను కొనసాగించాడు. అయితే.. కొన్ని నెలల క్రితం తన స్నేహితురాలి ద్వారా అనాథ అయిన యాస్మిన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు మురుగన్ సులభంగా డబ్బు సంపాదించడానికి తన ప్రియురాలని తన నేర కార్యకలాపాలకు ఉపయోగించుకున్నాడు.

నకిలీ తాళం చెవి ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను ఎలా దొంగిలించాలో యాస్మిన్‌‌కు నేర్పించాడు. అదేవిధంగా మల్లేశ్వరం, శ్రీరాంపూర్, కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ప్రేమ జంట ద్విచక్ర వాహనాలను దొంగిలించారు. అనంతరం మురుళి ద్వారా దొంగిలించిన వాహనాలను మురుగన్ అమ్మి డబ్బు చేసేవాడు. అలా సంపాదించిన డబ్బుతో నిందితులు సరదాగా గడిపారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవల మల్లేశ్వరంలోని 15వ అవెన్యూలో గల ఎంఈఎస్‌ కళాశాల సమీపంలో విద్యార్థి కౌశిక్‌ మొబైల్‌ ఫోన్‌ను దుండగులు లాక్కొని పారిపోయారు.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా మురుగన్ బృందాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీకి గురైన విషయం బయటపడింది. అరెస్టైన నిందుతుల నుంచి రూ.లక్ష విలువైన 2 మొబైల్‌లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఈ ప్రేమ జంట బైక్‌ చోరీల గుట్టు రట్టైంది. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో వారికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది.



Next Story

Most Viewed