- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్ల బకెట్ లో పడి బాలుడు దుర్మరణం
by Sridhar Babu |
మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన 10 నెలల బాలుడు చౌదరి తన్వీర్ గురువారం నీళ్ల బకెట్ లో పడి మృతి చెందాడు.

X
దిశ, వాంకిడి : మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన 10 నెలల బాలుడు చౌదరి తన్వీర్ గురువారం నీళ్ల బకెట్ లో పడి మృతి చెందాడు. ఏఎస్ఐ పోషెట్టి తెలిపిన వివరాల ప్రకారం తేజపూర్ కు చెందిన గిర్మాజి, సునీత దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు కూతుళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. గిర్మాజి వ్యవసాయ పనులకు వెళ్లగా సునీత ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంది.
తన్వీర్ ఆడుకుంటూ ప్రమాదవ శాత్తు నీళ్ల బకెట్ లో పడ్డాడు. కొంత సేపటి తరువాత గమనించిన తల్లి బాలుడిని ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకు న్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు.
- Tags
- boy died
Next Story






