- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుని మృతదేహం కలకలం..చేయిపై హిందీ పచ్చబొట్టు కూడా !
తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని రాజీవ్ రహదారి పై మంగళవారం రాత్రి ఓ యువకుడు గాయాలతో మృతి చెందాడు.

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని రాజీవ్ రహదారి పై మంగళవారం రాత్రి ఓ యువకుడు గాయాలతో మృతి చెందిన సంఘటన చర్చనీయాంశం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామకృష్ణ కాలనీలోని రాజీవ్ రహదారి పై మంగళవారం రాత్రి దాదాపు 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుని మృతదేహన్ని గుర్తించారు స్థానికులు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కాగా మృతుడు గ్రీన్ కలర్ టీషర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి ఉన్నాడు. కాగా మృతుని చేయి పై కిషోరి అని హిందిలో రాసి ఉంది. దీంతో ఇతను వేరే రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరో చేయిపై ఆర్. హెచ్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతున్ని గుర్తించేందుకు అతని ఫోటోను విడుదల చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.






