నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. చికిత్స పొందుతూ మృతి

by Chintha Aamani |

ఓ బైక్ నడుచుకుంటూ వెళుతున్న వారిని ఢీ కొనగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. చికిత్స పొందుతూ మృతి
X

దిశ,వెల్దండ: ఓ బైక్ నడుచుకుంటూ వెళుతున్న వారిని ఢీ కొనగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వెల్దండ మండల పరిధిలోని రాఘాయి పల్లి గేట్ వద్ద గురువారం రాత్రి జరిగింది. రాఘాయి పల్లి కి చెందిన శవ మల్లేష్, శవ మల్లేష్, శవ పెంటయ్య లు పెళ్లి పనుల నిమిత్తం బంధువులతో కలిసి పుట్ట మన్ను తీసుకురావడానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి పై ఓ బైకు ఢీకొనగా నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సదరు బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శవ మల్లేష్(40) ను హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజాము మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story