10వ తరగతి విద్యార్థిని హత్యచేసిన 9వ తరగతి విద్యార్థి.. చెలరేగిన ఆందోళనలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-21 15:34:19  IST  )

15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిపై అదే స్కూల్‌కి చెందిన 9వ తరగతి విద్యార్థి ఘోరంగా దాడికి పాల్పడ్డాడు.

10వ తరగతి విద్యార్థిని హత్యచేసిన 9వ తరగతి విద్యార్థి.. చెలరేగిన ఆందోళనలు
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ స్కూ్ల్లో చదువుతున్న 15 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిపై అదే స్కూల్‌కి చెందిన 9వ తరగతి విద్యార్థి ఘోరంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో 10వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడు సింధీ కమ్యూనిటీకి చెందినవాడు కావటం, నిందితుడు ముస్లిం మతానికి చెందిన వాడు కావటంతో ఘటనపై భారీగా ఆందోళనలు చెలరేగాయి.

బుధవారం విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి హిందూ సంస్థలు, అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకుని నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులు పాఠశాల ఆవరణలో విధ్వంసానికి పాల్పడటంతో పాటు, కొంత మంది సిబ్బందిపై దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో అక్కడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు స్కూల్ వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్, మేనేజ్‌మెంట్‌పై కూడా విద్యార్థి తల్లిదండ్రులు, హిందూ సంస్థలు ఫిర్యాదులు దాఖలు చేశాయి. పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేనకు 9వ తరగతి విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని, జువైనల్ చట్టాల ప్రకారం చర్యలు చేపట్టారు.

Next Story